జ్యోతిషశాస్త్రం లో పచంగం వాడతారు. పంచాంగం అనేది హిందూ క్యాలెండర్, ఇది సాంప్రదాయ హిందూ సమయపాలనను అనుసరిస్తుంది మరియు ముఖ్యమైన తేదీలు మరియు వాటి లెక్కలను పట్టిక రూపంలో అందిస్తుంది.
మన భారతీయ శాస్త్రాలు సమయం యొక్క మంచి, చెడులు తెలుసుకోవటానికి సమయాన్ని ఐదు భాగాలుగా విభజించారు. అవి తిథి, వార, నక్షత్ర, యోగ కరణాలు. ఈ ఐదింటిని కలిపి పంచాంగంఅని పిలుస్తారు.
హిందూ పండగలు, ఆచారాలు, సాంప్రదాయాలు అన్ని కూడా ఈ పంచాంగం పై ఆధారపడి ఉంటాయి. ఏ సుముహూర్తమైనా తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాల ఆధారంగా లెక్కించటం జరుగుతుంది. సూర్య, చంద్రుల గతి, స్థితి ఆధారంగా పంచాంగం లెక్కించ బడుతుంది.