
ఈశా ఫౌండేషన్' వ్యవస్థాపకులైన సద్గురు ఒక యోగి, మార్మికులు, ఇంకా ఒక విలక్షణమైన ఆధ్యాత్మిక గురువు.అపారమైన ఆధ్యాత్మిక విజ్ఞానంతో కూడుకున్న ఆయన ఆచరణాత్మకమైన జీవితం ఇంకా జీవితంలో ఆయన చేస్తున్న కృషి - ఆత్మ పరివర్తన శాస్త్రం కాలం చెల్లిన గతానికి సంబంధించిన నిఘూడ విద్య కాదని, అది నేటి కాలానికి అత్యంత అవసరమైన సమకాలీన శాస్త్రమని గుర్తు చేస్తాయి.